పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మక్తాల ఫౌండేషన్ ఛైర్మన్ జలంధర్ గౌడ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని మారుతి కాలనీలో చిన్నారులతో కలిసి మొక్కలను నాటారు. పర్యావరణాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. కరోనా వైరస్ నివారణ, మొక్కల పెంపకం - వాటి ప్రాధాన్యతను తెలిపేలా ద్విచక్రవాహనానికి ప్లకార్డులు ఏర్పాటు చేసుకొని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
'పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత' - పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్న మక్తాల ఫౌండేషన్
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని మక్తాల ఫౌండేషన్ ఛైర్మన్ జలంధర్ గౌడ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని మారుతి కాలనీలో చిన్నారులతో కలిసి ఆయన మొక్కలను నాటారు. కరోనా నివారణ, మొక్కల పెంపకం ప్రాధాన్యతను తెలిపేలా ద్విచక్ర వాహనానికి ప్లకార్డులు ఏర్పాటు చేసుకొని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
'పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత'
పర్యావరణ పరిరక్షణకు అందరూ ముందుకు రావాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ... స్వీయ నియంత్రణ, వ్యక్తిగత శుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన పలువురికి మాస్కులను పంపిణీ చేశారు. కాలుష్య నివారణలో భాగంగా మోటారు వాహనాలకు బదులుగా.. సైకిళ్లను వాడాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క నాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :'భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత భూమినిద్దాం'