తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంజినీరింగ్ సీటు పొందిన అభ్యర్థుల సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు - ఎంసెట్​-2020

మొదటి విడత కౌన్సెలింగ్​లో ఇంజినీరింగ్ సీటు పొందిన అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువు రేపటి వరకు పొడిగించారు. మొదటి విడతలో 50, 288 మందికి సీట్లు దక్కాయి. వారిలో ఇప్పటి వరకు 36, 650 మంది మాత్రమే ఆన్​లైన్​లో బోధన రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు.

engineering students self reporting time extend to tommorrow
ఇంజినీరింగ్ సీటు పొందిన అభ్యర్థుల సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు

By

Published : Oct 28, 2020, 8:57 PM IST

ఇంజినీరింగ్​ విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువు ఒక రోజు పొడగించారు. మొదటి విడత కౌన్సెలింగ్​లో ఇంజినీరింగ్ సీటు పొందిన అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు రేపటి వరకు పొడిగించారు. మొదటి విడతలో 50, 288 మందికి సీట్లు దక్కాయి. వారిలో ఇప్పటి వరకు 36, 650 మంది మాత్రమే ఆన్​లైన్​లో బోధన రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు.

మరో 13, 629 మంది అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయనందున మరో అవకాశం ఇచ్చారు. తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలులోనూ మార్పులు జరగనున్నాయి. గురువారం జరగాల్సిన స్లాట్ బుకింగ్ ప్రక్రియ వాయిదా పడింది. షెడ్యూలులో మార్పులపై రేపు ప్రవేశాల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.

ఇదీ చదవండి:సరోజ్​ కుమార్​ ఠాకూర్​ నియామకాన్ని స్వాగతిస్తున్నాం: బండి

ABOUT THE AUTHOR

...view details