తెలంగాణ

telangana

ETV Bharat / state

OXYGEN: విద్యార్థుల ఆవిష్కరణ... అతితక్కువ ఖర్చుతో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ - ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రతిభ

ఇంజినీరింగ్ విద్యార్థులు తమ మేధస్సుకు పనిచెప్పారు. అధ్యాపకుల సహకారంతో ఓ నూతన యంత్రాన్ని ఆవిష్కరించారు. అతి తక్కువ ఖర్చుతో ప్రాణవాయువు అందించే పరికరానికి ప్రాణం పోశారు. అత్యవసర వైద్య సేవలకు ఉపయోగించే కాన్సన్‌ట్రేటర్‌ యంత్రాన్ని రూపొందించారు. తక్కువ ధరకే లభించేలా నీటిశుద్ధి యంత్రంతో తయారు చేశారు. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం.

అతితక్కువ ఖర్చుతో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌
అతితక్కువ ఖర్చుతో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌

By

Published : Jun 29, 2021, 7:41 PM IST

Updated : Jun 29, 2021, 8:11 PM IST

ఇంజినీరింగ్ విద్యార్థులు తమ మేధస్సును చాటుకున్నారు. అధ్యాపకుల సహకారంతో అత్యవసర వైద్యానికి వినియోగించే ఆక్సిజన్​ కాన్సన్‌ట్రేటర్‌ రూపొందించారు. హైదరాబాద్​లోని లార్డ్స్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ నూతన యంత్రాన్ని ఆవిష్కరించారు.

వాటర్​ ప్యూరిఫైయర్​తో...

మన ఇళ్లలో వినియోగించే నీటి శుద్ధియంత్రంతో ప్రాణవాయువు అందించే పరికరాన్ని తయారు చేశారు. మెకానికల్ విభాగానికి చెందిన విద్యార్థులు ఈ ప్రాజెక్టులో పాల్గొన్నారు. అతితక్కువ ధరలో ఆక్సిజన్​ కాన్సన్‌ట్రేటర్‌ అందించాలనే ఉద్దేశంతో రూపొందించామని విద్యార్థులు తెలిపారు. కేవలం ఇరవై వేల రూపాయల ధరకే అందుబాటులో తీసుకురావాలనేది తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ యంత్రంలో ఎలాంటి సమస్య వచ్చినా మరమ్మతులు చేస్తామని వివరించారు. భవిష్యత్తులో ఇంకా తక్కువ ధరకు ఆక్సిజన్​ కాన్సన్‌ట్రేటర్‌ అందించడమే తమ లక్ష్యమని వారు వెల్లడించారు.

ఈ రోజుల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ప్రిన్సిపల్ నరసింహులు తెలిపారు. ఈ సమయంలో వారికి అతి తక్కువ ధరలు అందుబాటులో వచ్చే విధంగా వాటర్ ప్యూరిఫైయర్​ను ఆక్సిజన్​ కాన్సన్‌ట్రేటర్‌​గా రూపొందించినట్లు వెల్లడించారు. సాంకేతిన పరిజ్ఞానాన్ని వినియోగించి అందుబాటులో తీసుకొచ్చామని ఆయన అన్నారు. ఈ పరికరాన్ని తయారు చేసిన విద్యార్థులు, అధ్యాపక బృందానికి ప్రిన్సిపల్ ధన్యవాదాలు తెలిపారు.

మా విద్యార్థులు, సిబ్బంది వాటర్​ ప్యూరి ఫైయర్​తో ఆక్సిజన్​ కాన్సన్‌ట్రేటర్‌ తయారు చేశారు. ఏడాదిన్నర కాలంగా కరోనా వల్ల ఆక్సిజన్​ కొరత ఏర్పడి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్తు సమయంలో మేము ఈ ప్రాజెక్టు చేపట్టాం. ఈ ఆక్సిజన్​ కాన్సన్‌ట్రేటర్‌ రూపొందించడంలో మా విద్యార్థులు సక్సెస్​ అయ్యారు. ఈ పరికరం అతి తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చాం. రాబోయే కాలంలో ప్రజలకు మరింత తక్కువ ధరలో ఆక్సిజన్ పరికరం అందించేందుకు కృషి చేస్తాం.

- నర్సింహులు, కళాశాల ప్రిన్సిపల్

ఇదీ చూడండి:రాష్ట్రంలో 97.24 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు

Last Updated : Jun 29, 2021, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details