తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులు ఖరారు..​ అలాగే ఎంబీయే కూడా.. - ఇంజనీరింగ్​ ఫీజులు

engineering fees
ఇంజనీరింగ్​ ఫీజులు

By

Published : Oct 19, 2022, 3:51 PM IST

Updated : Oct 19, 2022, 7:49 PM IST

15:49 October 19

ఇంజినీరింగ్ ఫీజులను ఖరారు చేసిన ప్రభుత్వం

Engineering fees fixed by telangana: ఇంజినీరింగ్ ఫీజులు భారీగా పెరిగాయి. బీటెక్ తో పాటు ఎంటెక్, ఎంబీయే, ఎంసీయే రుసుములు కూడా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 40 కాలేజీల్లో బీటెక్ వార్షిక రుసుము లక్ష రూపాయలు దాటింది. కనీస రుసుము రూ.35వేల నుంచి రూ.45వేలకు చేరింది. ఎంటెక్​లో కనీస ఫీజు రూ. 57వేల రూపాయలు.. ఎంబీయే, ఎంసీయే కనీస రుసుము రూ.27వేలు అయింది. ఫీజు రీఎంబర్స్​మెంట్​ పెంపుపై మాత్రంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.

ఇంజినీరింగ్​ ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లు కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పాత ఫీజులే కొనసాగించాలని రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ.. మొదట భావించింది. కొన్ని కాలేజీలు హైకోర్టును ఆశ్రయించి తాము కోరిన ఫీజులే వసూలు చేసేలా మధ్యంతర ఉత్తర్వులు పొందాయి. ఈ నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలతో టీఎస్ఏఎఫ్ఆర్సీ చర్చించి ఫీజులు ఖరారు చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఏఎఫ్‌ఆర్‌సీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని 159 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 40 కాలేజీల్లో ఇంజినీరింగ్ వార్షిక రుసుము లక్ష రూపాయలు దాటింది. ఇప్పటి వరకు కనీస రుసుము రూ.35వేల రూపాయలు ఉండగా.. దాన్ని రూ.45వేలకు ప్రభుత్వం పెంచింది. అత్యధికంగా ఎంజీఐటీలో లక్ష 60వేల రూపాయలు.. సీవీఆర్​లో లక్షన్నర, సీబీఐటీ, వర్ధమాన్, వాసవీలో లక్ష 40వేల రూపాయల ఫీజును ఖరారు చేసింది. ఎన్ఆర్ఐ కోటాలో గరిష్ఠ ఫీజు 5వేల డాలర్లుగా నిర్ణయించింది. ప్రవేశాల సమయంలో సుమారు మూడున్నర వేల రూపాయలు.. ఎన్‌బీయే గుర్తింపు ఉంటే మరో 3వేల రూపాయలు అదనంగా చెల్లించాలి. ఎంటెక్, ఎంబీయే, ఎంసీయే ఫీజులను కూడా ప్రభుత్వం పెంచింది. ఎంటెక్ కనీస ఫీజు 57వేలు.. ఎంబీయే, ఎంసీయే కనీస వార్షిక రుసుము 27వేలకు పెరిగింది. ఈ ఫీజులు మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయి.

ఫీజులు పెంచినప్పటికీ రీఎంబర్స్‌మెంట్ పెంపుపై ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. ఎంసెట్ లో పదివేల ర్యాంకు వరకు ప్రభుత్వమే పూర్తిగా ఫీజులు చెల్లిస్తోంది. అయితే పదివేల ర్యాంకు దాటిన బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఇప్పటి వరకు కనీస రుసుము 35వేల రూపాయలు ఫీజు రీఎంబర్స్ మెంట్ ప్రభుత్వం ఇస్తోంది. బీసీ, ఈబీసీలకు కూడా ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి రీఎంబర్స్ మెంట్ ఇవ్వాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ప్రభుత్వం వద్ద పెండింగులో ఉంది. ఫీజులు పెంచిన నేపథ్యంలో ఫీజు రీఎంబర్స్‌మెంట్ పెంచుతారా లేదా అని విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 19, 2022, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details