తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబంబించే... బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 16నుంచి... పండగను నిర్వహించాల్సి ఉండగా.. గురువారం పితృఅమావాస్య కావడంతో మెుదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మను పేర్చారు.
ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు... తీరొక్క పూలు పేర్చి ఆట పాటలు - తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం
గురువారం పితృఅమావాస్య కావడంతో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మలు పేర్చారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి... మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ... ఆడుతూ పాడుతూ పండుగను నిర్వహించారు.
ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు... తీరొక్క పూలు పేర్చి ఆట పాటలు
మహిళలంతా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి... ఆడి పాడారు. అధిక ఆశ్వయుజ మాసం కావడంతో... వచ్చేనెల 17 నుంచి పండగను కొనసాగించనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మహిళలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ పండుగను నిర్వహించుకున్నారు.