మధుకాన్ గ్రూప్ సంస్థల కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఈడీ(enforcement directorate) సోదాలు జరిపింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఎంపీ నామ నాగేశ్వరరావుతో మధుకాన్ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేపట్టింది.
ED: ఆ సంస్థలో రెండో రోజు కొనసాగిన ఈడీ సోదాలు - తెలంగాణ వార్తలు
రెండో రోజు కూడా మధుకాన్ గ్రూప్ సంస్థల కార్యాలయాల్లో ఈడీ(enforcement directorate) అధికారులు సోదాలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎంపీ నామ నాగేశ్వరరావుతోపాటు మధుకాన్ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.

ED: ఆ సంస్థలో రెండో రోజు కొనసాగిన ఈడీ సోదాలు
ఇవాళ పలు కార్యాలయాలు తనిఖీ చేయడంతోపాటు... బ్యాంకుల్లో లాకర్లు, ఖాతాలను ఈడీ బృందాలు పరిశీలించాయి. జాతీయ రహదారి నిర్మాణం కోసం రాంచీ ఎక్స్ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో... వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఇతర అవసరాల కోసం మళ్లీంచినట్లు మధుకాన్ గ్రూపుపై ఈడీ అభియోగం.