తెలంగాణ

telangana

ETV Bharat / state

ed raids on karvy office: కార్వీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు

karvy
karvy

By

Published : Sep 22, 2021, 12:39 PM IST

Updated : Sep 22, 2021, 3:50 PM IST

12:35 September 22

కార్వీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు

 హైదరాబాద్‌ కార్వీ కార్యాలయాల్లో ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు సోదాలు చేస్తున్నారు(ed raids on karvy office). ఉదయం నుంచి నగరంలోని పలు కార్వీ కార్యాలయాలతో పాటు వాటి అనుబంధ సంస్థల్లో ఏక కాలంలో ఈడీ సోదాల చేస్తోంది. బంజారాహిల్స్, నానకరాం గూడా, అమీర్ పేటతో సహా మొత్తం ఎనిమిది చోట్ల సీఆర్ఫీఎఫ్ బలగాల భద్రతతో ఈడీ సోదాలు చేస్తోంది. ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్‌సీ బ్యాంకుల నుంచి రూ. 12 వందల కోట్లకు పైగా అక్రమంగా రుణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కుంభకోణంలో ముఖ్యంగా మనీ లాండరింగ్ జరిగిందని గుర్తించిన ఈడీ కార్వీ కార్యాలయాలపై సోదాలు చేయడం ప్రాధాన్యత సంతరిచుకుంది. ఈ కేసులో సోదాల అనంతరం మరికొంత మందిని ఈడీ విచారించే అవకాశం ఉంది. మనీలాండరింగ్ కేసులో కార్వీ ఛైర్మన్ సహా పలువురు ఇప్పటికే అరెస్టు అయ్యారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు, ఆధారాల కోసం ఈడీ అధికారులు ఇవాళ కార్వీ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. కార్వీ కుంభకోణం కేసులో అరెస్టు అయిన వారిని కూడా ఈడీ విచారించింది. 

మరోవైపు ఈ కేసులో ఆ సంస్థ మాజీ ఎండీ పార్థసారథిని బెంగుళూరు పోలీసుల కస్టడీకి హైకోర్టు నిలిపివేసింది. ముందుగా నాంపల్లి కోర్టు విచారణకు ఆదేశించింది. దీనిపై పార్థసారథి హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్యం వల్ల విచారణకు హాజరుకాలేనని విన్నవించారు. పరిశీలించిన ధర్మాసనం.. పీటీ వారెంట్​ను రద్దు చేసింది. సెప్టెంబర్ 8న బెంగళూరులోని శేశాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో పార్థసారథిపై కేసు నమోదైంది. 109 కోట్ల రూపాయల మోసం కేసులో పార్థసారిథితో పాటు కార్వీ సీఈవో రాజీవ్ రంజన్, సీఎఫ్​వో కృష్ణహరిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులోనే బెంగళూరు పోలీసులు విచారణ జరపాల్సి ఉంది.

పక్కా ప్రణాళికతో..

బ్యాంకుల నుంచి రూ.వందల కోట్లు రుణం తీసుకుని ఎగవేసిన కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ అక్రమాలు మరిన్ని వెలుగుచూస్తున్నాయి. ఈ అక్రమాల్లో కీలకపాత్ర పోషించిన ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకృష్ణ గురజాడను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీపీ హరికృష్ణ.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని సొంతానికి వినియోగించుకునేందుకు ఆయన ఎనిమిదేళ్ల కిందట ప్రణాళికను సిద్ధం చేశాడు. సదరు సంస్థ ఛైర్మన్‌ పార్థసారథితో కలిసి రూ. 300 కోట్లు మళ్లించాడు. పార్థసారథి ఫోను, లాప్‌టాప్‌లోని వివరాల ఆధారంగా పోలీసులు పరిశోధించగా.. శ్రీకృష్ణ అక్రమ లావాదేవీలకు ఆధారాలు లభించాయి.

ఇదీ చూడండి:Karvy Case: పార్థసారథిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సైబరాబాద్​ పోలీసులు!

Last Updated : Sep 22, 2021, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details