ఈఎస్ఐ మందుల కుంభకోణంలో రాష్ట్ర కార్మిక శాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాజీ వ్యక్తిగత కార్యదర్శి ముకుంద్ రెడ్డిని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నిస్తోంది. ఈఎస్ఐ మందులు, బీమా సేవల రూపంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే తేల్చింది. డొల్ల కంపెనీలు, బోగస్ బిల్లులతో వేల కోట్ల రూపాయలు కాజేసినట్లు అనిశా అభియోగం.
ఈఎస్ఐ మందుల కుంభకోణంలో ముకుంద్రెడ్డిని ప్రశ్నిస్తోన్న ఈడీ - ఈఎస్ఐ మందుల కుంభకోణంలో ముకుంద్రెడ్డిని ప్రశ్నిస్తోన్న ఈడీ
ఈఎస్ఐ మందుల కుంభకోణం కేసులో విజిలెన్స్ నివేదికలు, అనిశా దర్యాప్తు ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ... మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాజీ వ్యక్తిగత కార్యదర్శి ముకుంద్ రెడ్డిని ప్రశ్నిస్తోంది.
![ఈఎస్ఐ మందుల కుంభకోణంలో ముకుంద్రెడ్డిని ప్రశ్నిస్తోన్న ఈడీ enforcement directorate questioning nayini narsimhareddy personal secretary on esi medical scam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9426806-991-9426806-1604479476223.jpg)
ఈఎస్ఐ మందుల కుంభకోణంలో ముకుంద్రెడ్డిని ప్రశ్నిస్తోన్న ఈడీ
ఈ కేసులో ఈఎస్ఐ మాజీ సంచాలకురాలు దేవికారాణి సహా పలువురిని అనిశా అధికారులు అరెస్టు చేశారు. విజిలెన్స్ నివేదికలు, అనిశా దర్యాప్తు ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ ఇవాళ ముకుంద్ రెడ్డిని విచారిస్తోంది. బిల్లుల మంజూరు, బడ్జెట్ కేటాయింపుల వ్యవహారంలో మంత్రి కార్యాలయం, ఇతర అంశాలపై ఈడీ విచారణ జరుపుతోంది.
ఇవీ చూడండి: అప్పులే శరణ్యంగా సగం కుటుంబాల జీవనం!