హీరా గోల్డ్ సంస్థ.. లక్షల మందిని మోసం చేసి కూడ బెట్టుకున్న సొమ్మును వెలికి తీసేందుకు దర్యాప్తు కొనసాగుతోందని హైకోర్టుకు ఈడీ తెలిపింది. హీరా గ్రూపు కంపెనీల బ్యాంకు ఖాతాలను.. నౌహీరా షేక్ కు సంబంధించిన భూలావాదేవీలను పరిశీలిస్తున్నామని ఈడీ తెలిపింది. ఇప్పటికే సుమారు 300 కోట్ల రూపాయల విలువైన స్థిర, చరాస్తులను తాత్కాలిక జప్తు చేసినట్టు వివరించింది. హీరా గోల్డ్ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ సయ్యద్ అక్తర్, సయ్యద్ ఆఫ్సర్, సయ్యద్ కైసర్లు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. వారిని నిందితులుగా పిలవలేదని.. వారి ఖాతాలోకి 149 కోట్లు బదిలీ అయినట్లు విచారణలో తేలినందున వివరణ కోసం నోటీసులు ఇచ్చినట్లు ఈడీ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు వాదించారు.
హీరాగోల్డ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ - ed on heeragold case
హీరాగోల్డ్ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ సయ్యద్ అక్తర్, సయ్యద్ ఆఫ్సర్, సయ్యద్ కైసర్లు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిగింది. వారిని నిందితులుగా పిలవలేదని ఈడీ తరఫున ఏఎస్జీ రాజేశ్వర రావు వాదించారు. వారు విచారణకు హాజరు కావడం లేదని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు... ఈడీ విచారణకు హాజరు కావాలని పిటిషనర్లను ఆదేశించారు.
సామాన్య ప్రజలు జీవితాంతం కష్టపడి కూడబెట్టుకుని పోగొట్టుకున్న సొమ్ముపై వివరణ ఇవ్వడానికి బదులు కోర్టుకు రావడం సరికాదన్నారు. హీరాగోల్డ్ సుమారు 2 లక్షల మందిని మోసం చేసి 5800 కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడిందని ఈడీ పేర్కొంది. అక్రమ సొమ్మును భూములు, బినామీల పేరిట మళ్లించారని వాటిని వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపింది. సయ్యద్ అక్తర్, సయ్యద్ ఆఫ్సర్, సయ్యద్ కైసర్ విచారణకు సహకరించడం లేదని ఏఎస్జీ వాదించారు. వాదనలు విన్న హైకోర్టు.. ఈడీ విచారణకు హాజరుకావాలని పిటిషనర్లను ఆదేశించారు. అయితే వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని ఈడీని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను ముగించింది.
ఇవీ చూడండి: యూకే నుంచి గిఫ్ట్ అని... 4 లక్షలు కొల్లగొట్టారు