తెలంగాణ

telangana

ETV Bharat / state

DRUGS CASE: డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ మొదలైంది..

DRUGS CASE: డ్రగ్స్ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ విచారణ
DRUGS CASE: డ్రగ్స్ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ విచారణ

By

Published : Aug 30, 2021, 4:58 PM IST

Updated : Aug 30, 2021, 7:45 PM IST

16:55 August 30

DRUGS CASE: డ్రగ్స్ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ విచారణ

డ్రగ్స్ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ విచారణ మొదలైంది. ఈ మేరకు ఎక్సైజ్​ సిట్ అధికారి శ్రీనివాస్ నుంచి ఈడీ అధికారులు వివరాలు సేకరించారు. 2017లో డ్రగ్స్ కేసు ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించిన శ్రీనివాస్.. నేడు ఈడీ అధికారులకు పూర్తి వివరాలు సమర్పించారు. సిట్​ దర్యాప్తు క్రమాన్ని ఈడీకి వివరించారు.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో(Tollywood Drugs case) రేపటి నుంచి ఈడీ(ED) విచారణ జరపనుంది. ఈ మేరకు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దర్శకుడు పూరీ జగన్నాథ్(Puri Jagannadh) రేపు విచారణకు హాజరుకానున్నారు.

రేపటి నుంచి సెప్టెంబర్​ 22 వరకు..

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో(Tollywood Drugs case) మనీలాండరింగ్ కేసు(Money laundering case) నమోదు చేసిన ఈడీ అధికారులు... దర్శకుడు పూరి జగన్నాథ్‌ను(Puri Jagannadh) రేపు ప్రశ్నించనున్నారు. ఈ మేరకు ఆయనకు ఈడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. రేపు ప్రారంభమయ్యే విచారణ సెప్టెంబర్ 22 వరకు కొనసాగనుంది. సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు జారీ చేశారు. నిర్ధేశించిన తేదీల్లో విచారణకు హాజరుకావాలని సూచించారు.

11 నేరాభియోగ పత్రాలు..

టాలీవుడ్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేసిన ఆబ్కారీ శాఖ సిట్ అధికారులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరితోపాటు మరికొంత మందిపై విచారణ జరిపే అవకాశం ఉంది. డ్రగ్స్ కేసులో ఆబ్కారీ శాఖ సిట్ అధికారులు మొత్తం 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఇందులో 12 మంది సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు... మరో 50 మందిని విచారించారు. ఇప్పటి వరకు 11 నేరాభియోగపత్రాలు దాఖలు చేశారు.

ప్రస్తావన లేదు..

అభియోగపత్రాల్లో ఆఫ్రికా దేశాలకు చెందిన మత్తు మందు సరఫరాదారులతో పాటు... స్థానికంగా డ్రగ్స్ విక్రయించే వ్యక్తులున్నారు. 12 మంది సినీతారల గోర్లు, తల వెంట్రుకల నమూనాలు సైతం సేకరించిన ఆబ్కారీ అధికారులు.... ఎక్కడ కూడా వాళ్ల ప్రస్తావన తీసుకురాలేదు. ప్రస్తుతం మనీలాండరింగ్ చట్టం(Money laundering) కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు సైతం... 12 మంది సినీరంగానికి చెందిన వారిని సాక్ష్యాలుగానే ప్రశ్నించే అవకాశం ఉంది. మనీ లాండరింగ్ జరిగినట్లు తేలితే ఆ వ్యక్తులపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

సంబంధిత కథనం..

Tollywood Drugs case: 12 మందికి ఈడీ నోటీసులు.. రేపు విచారణకు పూరీ జగన్నాథ్!

Last Updated : Aug 30, 2021, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details