చైనా ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల కేసులో ఈడీ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. దిల్లీ, గురుగావ్, ముంబై, పూణేలోని 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. కీలక ఆధారాలు సేకరించింది. నాలుగు హెచ్ఎస్బీసీ బ్యాంకు ఖాతాల్లో 47 కోట్ల రూపాయలు స్తంభింప చేసింది. సోదాల్లో 17 హార్డ్ డిస్క్‌లు, 5 ల్యాప్ టాప్‌లు, ఫోన్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఈ-కామర్స్ ముసుగులో చైనీయుల బెట్టింగ్ యాప్‌లు - ccs police
భారతదేశంలోని యువతను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠాపై ఈడీ దృష్టి సారించింది. చైనా ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల కేసులో ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. ఏకకాలంలో దేశంలోని 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ-కామర్స్ పేరుతో చైనీయులు వందలాది బెట్టింగ్ యాప్‌లు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ-కామర్స్ పేరుతో చైనీయులు వందలాది బెట్టింగ్ యాప్‌లు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. డాకీ పే అనే ఒక్క కంపెనీనే ఒక్క ఏడాదిలోనే 1268 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు ఈడీ గుర్తించింది. సీఏల సహకారంతో.. డమ్మీ డైరెక్టర్లతో చైనీయులు భారత్‌లో వందల కంపెనీలు సృష్టించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ వెబ్సైట్లన్నీ అమెరికా నుంచి కొనసాగుతున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. పేటీఎం, తదితర మొబైల్ వాలెట్ల ద్వారా ఎక్కువగా లావాదేవీలు జరిపినట్టు ఈడీ గుర్తించింది. ఆన్లైన్ వాలెట్ సంస్థలు, హెచ్ఎస్బీసీ, ఆర్వోసీల నుంచి ఈడీ సమాచారం సేకరిస్తోంది.
ఇవీ చూడండి: బ్యాంకును మోసం చేశారంటూ సర్వోమ్యాక్స్‌పై సీబీఐలో కేసు నమోదు