తెలంగాణ

telangana

ETV Bharat / state

'విద్యుత్​ ఉద్యోగుల విభజనలో సుప్రీం తీర్పును అమలు చేయండి'

విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంలో సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని... బీసీ ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్స్ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.

'విద్యుత్​ ఉద్యోగుల విభజనలో సుప్రీం తీర్పును అమలు చేయండి'
'విద్యుత్​ ఉద్యోగుల విభజనలో సుప్రీం తీర్పును అమలు చేయండి'

By

Published : Dec 9, 2020, 5:33 PM IST

తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంలో సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని... బీసీ ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్స్ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. హైకోర్ట్​, సుప్రీంకోర్టు న్యాయవాదులు రూ. 100 కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించి కోర్టులో వాదించినా తీర్పు సంస్థకు-ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందని సంఘం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ తెలిపారు.

ఇందుకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి, సీఎండీలు ప్రభాకర్ రావుతో పాటు పాలక మండలి తక్షణమే రాజీనామాలు చేసి... ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. నాలుగున్నర ఏళ్ల నుంచి పరోక్షంగా మొత్తం రూ. 6,600 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విద్యుత్ సంస్థల యాజమాన్యాలు పూర్తి బాధ్యత వహించాలని కోరారు.

ఆరేళ్లలో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో వేలాది మంది తెలంగాణ ఉద్యోగులు పదోన్నతులు పొందలేదని ఆరోపించారు. తప్పుడు విధానాల కారణంగా విద్యుత్ సంస్థలు రూ. లక్ష కోట్లకు పైగా అప్పుల్లో మునిగి తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయన్నారు.

ఇదీ చదవండి:ఉల్లి నిల్వలపై నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details