తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కాలం: ఈసారి నిరాడంబరంగానే వినాయక చవితి వేడుకలు

కరోనా నేపథ్యంలో వినాయక చవితి వేడుకలను నిరాడంబరంగా జ‌రుపుకోవాల‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కోరారు. జనసమూహం లేకుండా ఇంటి వద్దనే పండుగ జరుపుకోవాలని సూచించారు.

vinayaka chavithi
కరోనా కాలం: ఈసారి నిరాడంబరంగానే వినాయక చవితి వేడుకలు

By

Published : Jul 29, 2020, 7:03 PM IST

Updated : Jul 29, 2020, 9:15 PM IST

వినాయక చవితి వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు. కరోనా వ్యాప్తి కారణంగా పండుగను ఇళ్లలోనే చేసుకోవాలని... సామూహిక నిమజ్జనాలు వద్దని సూచించారు.

కరోనా కారణంగా పండుగలన్నింటినీ నిరాడంబరంగా జ‌రుపుకున్నామ‌ని... అదే తరహాలో వినాయ‌క చ‌వితిని ఎలాంటి ఆర్భాటం లేకుండా నిర్వ‌హించుకోవాలని మంత్రి తెలిపారు. కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ఆధ్వర్యంలో మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:కరోనా దెబ్బ.. తలకోన పర్యాటకం కుదేలు

Last Updated : Jul 29, 2020, 9:15 PM IST

ABOUT THE AUTHOR

...view details