తెలంగాణ

telangana

ETV Bharat / state

"సైనికుల త్యాగాలకు గుర్తుగా 'భారత యాత్ర' అభినందనీయం" - pulvama attack Tributebharath yatra

పుల్వామా ఘటనలో ఉగ్రవాదులు భారత సైనిక దళాలపై దాడికి పాల్పడిన ఘటనను.. భారత సైనికుల త్యాగాలను గుర్తు చేస్తూ 'భారత యాత్ర' పేరుతో నలుగురు సభ్యులు చేసిన యాత్ర  అభినందనీయమని భాజపా నాయకుడు  పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. సంజీవయ్య పార్కులో ఈ యాత్ర ముగింపు కార్యక్రమం నిర్వహించారు.

సంజీవయ్య పార్కులో 'భారత యాత్ర' ముగింపు

By

Published : Nov 18, 2019, 11:40 AM IST

సంజీవయ్య పార్కులో 'భారత యాత్ర' ముగింపు

పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తూ.. దేశ భక్తిని.. సైనికుల ధీరత్వాన్ని గుర్తుచేస్తూ... ఐస్ స్టాండ్ ఫర్ ద నేషన్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యులు చేసిన 'భారత యాత్ర' ముగిసింది. దిల్లీ నుంచి కన్యాకుమారి మీదగా దాదాపు 27 నగరాలకు పైగా తిరిగి ఐదు వేల మైళ్ళ ప్రయాణించి హైదరాబాదులోని సంజీవయ్య పార్కు వద్ద ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాజపా నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. యాత్రలో పాల్గొన్న నలుగురు సభ్యులను ఆయన సన్మానించి అభినందనలు తెలియజేశారు. 2020 ఫిబ్రవరి 14వ తేదీ వరకు ప్రపంచంలోని ప్రతి భారతీయుడు దేశం కోసం నిలబడతాను అనే నినాదాన్ని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.

భారతమాత ముద్దుబిడ్డ జనసైనికులు విపత్కర పరిస్థితుల్లో మంచుకొండల్లో దేశ రక్షణ కోసం పాటు పడుతున్న వారిని విచక్షణరహితంగా ఘటనలో ఉగ్రవాదుల మట్టు పెట్టారని... వారి శూరత్వాన్ని, త్యాగాలను గుర్తు చేస్తూ చేసిన యాత్ర ఎంతో గొప్పదని సుధాకర్​ కొనియాడారు.

పుల్వామా ఘటనలో అమరులైన 64 మంది జవాన్లకు సంఘీభావంగా వారి ప్రాణ త్యాగాలను స్మరిస్తూ యాత్ర చేసినట్లు యాత్ర నిర్వాహకులు హరికృష్ణ తెలిపారు. భారత జాతీయ ఐక్యత నినాదాన్ని కొనసాగించేందుకు మరిన్ని కార్యక్రమాలు తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావం పొందాలని 'నేను నా దేశం కోసం నిలబడతాను' అనే నినాదాన్ని ప్రతి ఒక్కరిలో కల్పించాలనే ఉద్దేశ్యంతోనే తాము ఈ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు వారు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మె: పట్టు వీడ లేదు.. మెట్టు దిగ లేదు..?

ABOUT THE AUTHOR

...view details