తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్.. చివరిరోజు తరలివచ్చిన పుస్తకప్రియులు - హైదరాబాద్ తాజా వార్తలు

Hyderabad Book Fair Ended : కళాభారతిలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు సభ అట్టహాసంగా జరిగింది. 11 రోజుల పాటు జరిగిన పుస్తక ప్రదర్శన ఆఖరి రోజున నగరవాసులు పుస్తకాలు కొనేందుకు తరలివచ్చారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రాంగణమంతా సందడిగా మారింది.

బుక్ ఫెయిర్
బుక్ ఫెయిర్

By

Published : Jan 2, 2023, 8:53 AM IST

Updated : Jan 2, 2023, 10:10 AM IST

Hyderabad Book Fair Ended : హైదరాబాద్‌ దోమలగూడలోని ఎన్టీఆర్ స్టేడియంలో 11 రోజుల పాటు జరిగిన పుస్తక ప్రదర్శన ముగింపు రోజు అట్టహాసంగా సాగింది. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో పుస్తక ప్రియులు తరలివచ్చారు. ముగింపు సభకు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్​తో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఏడాదిలో రెండుసార్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ పెడితే బాగుంటుందని.. విద్యాసాగర్‌రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. మిద్దె రాములు ప్రాంగణం, అలిశెట్టి ప్రభాకర్ వేదికగా పేర్లు పెట్టడం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. పుస్తక పఠనం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకులాభరణం కృష్ణమోహన్‌ తెలిపారు.

కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచిన దివ్యవేద వాణి పుస్తకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రదర్శనలో ఉన్న అన్నింటిలో అతిపెద్ద పుస్తకం కావడంతో అందరినీ ఆకట్టుకుంది. అతిపెద్ద పుస్తకంగా వరల్డ్ రికార్డు పొందిన ఈ పుస్తకం.. రూ.24 వేలకు అమ్మకానికి ఉంది. మొత్తంగా ఆఖరి రోజు పుస్తక ప్రదర్శన ముగింపు సభతో పాటు.. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ చెరక ప్రదర్శన ఆకట్టుకుంది. చిన్నాపెద్దా చెరకా తిప్పుతూ.. సందడిగా గడిపారు.

Hyderabad Book Fair Ended

ఇవీ చదవండి:

Last Updated : Jan 2, 2023, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details