తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవస్థపై నమ్మకం, పారదర్శకత కోసమే ఈ-వాచ్: ఏపీ ఎస్​ఈసీ - telangana news

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అసాధారణ ఏకగ్రీవాలను గుడ్డిగా ఆమోదించబోమని.. పూర్తిగా సమీక్షించే నిర్ణయం తీసుకుంటామని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తేల్చి చెప్పారు. గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ-వాచ్ యాప్​పై ఆరోపణలు ఖండించిన నిమ్మగడ్డ.. వ్యవస్థపై నమ్మకం, పారదర్శకత కోసమే ఈ యాప్ తెచ్చినట్లు స్పష్టం చేశారు.

end-of-ap-sec-nimmagadda-ramesh-kumar-districts-tour-over-ap-local-polls-2021
వ్యవస్థపై నమ్మకం, పారదర్శకత కోసమే ఈ-వాచ్: ఏపీ ఎస్​ఈసీ

By

Published : Feb 5, 2021, 7:37 AM IST

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్... చివరిగా గుంటూరు జిల్లాలో పర్యటించారు. అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయని.. ఎన్నికలు జరగడానికి ఇదే సరైన సమయమన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకున్నట్లు వివరించారు. తాజాగా ఏపీ హైకోర్టు ఎన్నికలు ఆపడానికి వీల్లేదని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు వ్యతిరేకించే శక్తులు ఇప్పటికైనా అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. గ్రామస్థులు ఐకమత్యంగా చేసుకునే సాధారణ ఏకగ్రీవాలు గతంలోనూ ఉన్నాయన్న నిమ్మగడ్డ.. అసాధారణ ఏకగ్రీవాలను మాత్రం సమర్థింబోమన్నారు.

అవి కోర్టులో నిలబడవు...

వ్యవస్థ పట్ల విశ్వాసం, జవాబుదారీతనం కోసమే పంచాయతీ ఎన్నికల్లో ఈ-వాచ్ యాప్ ఏర్పాటు చేసినట్లు నిమ్మగడ్డ చెప్పారు. దీనిపైనా కోర్టుకు వెళ్లారని... అవి కోర్టులో నిలబడవని ధీమా వ్యక్తం చేశారు.

ఫిర్యాదులు..

అంతకుముందు ప్రకాశం జిల్లా ఒంగోలుకు వెళ్లిన నిమ్మగడ్డను... వివిధ పార్టీలు బలపరిచి అభ్యర్థులు, ప్రజాసంఘాల నేతల కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. నాగులప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో వాలంటీర్లు వైకాపా తరుఫున ప్రచారం చేస్తున్నారన్నారు. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయకపోతే పింఛన్లు, రేషన్‌ కార్డులు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారంటూ ఫొటోలతో సహా ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:'రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను తప్పక వినియోగిస్తా'

ABOUT THE AUTHOR

...view details