ETV Bharat / state
చివరిరోజు కోలాహలం.. ముగిసిన నామినేషన్ల పర్వం - PARLIMENT
రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసింది. చివరిరోజు, మంచిరోజు కావడం వల్ల భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ నియోజకవర్గంలో 130 మంది పసుపు, ఎర్రజొన్న రైతులు నామినేషన్లు వేశారు. మరో 40 మంది కర్షకులు వరుసలో నిల్చున్నారు.
ముగిసిన నామినేషన్ల పర్వం
By
Published : Mar 25, 2019, 3:47 PM IST
| Updated : Mar 25, 2019, 5:06 PM IST
రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాల నామినేషన్ల గడువు ముగిసింది. చివరిరోజు భారీగా నామపత్రాలు దాఖలు చేశారు. ఇప్పటికే ఆర్ఓ కార్యాలయాలకు చేరుకున్న వారికి నామపత్రాలు పూర్తి చేసేందుకు అవకాశం ఉంది. అత్యధికంగా నిజామాబాద్ నియోజకవర్గం నుంచి 130 మంది రైతులు నామినేషన్లు వేశారు. మరో 40 మంది కర్షకులు వరుసలో నిల్చున్నారు. రేపు అభ్యర్థుల నామినేషన్లు అధికారులు పరిశీలించనున్నారు. ఈనెల 28 వరకు నామపత్రాల ఉపసంహరణకు గడువు ఉంది. లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. Last Updated : Mar 25, 2019, 5:06 PM IST