ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ, నారాయణపూర్ జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ జవాన్ మృతి చెందాడు. మరో ఘటనలో ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మద్, ఓర్చా, కదర్ అటవీ ప్రాంతాల్లో డీఆర్జీ జవాన్లు కూంబింగ్ చేపట్టారు. అటవీ ప్రాంతంలో మావోలు ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని జవాన్లు ధ్వంసం చేశారు. ఆ కాల్పుల్లో ఓ జవాను మృతి చెందగా.. మావోయిస్టులు తప్పించుకున్నారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల డంపును స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ పి.సుందర్‌రాజ్ తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. జవాను మృతి - పోలీసు ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఓ డీఆర్జీ జవాను మృతి చెందగా, ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు పట్టుబడ్డారు. నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మద్, ఓర్చా, కదర్ అటవీ ప్రాంతాల్లో డీఆర్జీ జవాన్లు కూంబింగ్ చేపట్టారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని జవాన్లు కూల్చివేశారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ఓ జవాను మృతి చెందాడు.
దంతేవాడ జిల్లా కిరందుల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హిరోలీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నట్లు పోలీసు అధికారులకు సమాచారం అందటంతో డీఆర్జీ జవాన్లు గాలింపు చేపట్టారు. వారి రాకను పసిగట్టిన మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు యత్నించారు. ఆ ప్రాంతాన్ని జవాన్లు చుట్టుముట్టగా.. జోగా కుంజం, మడకం ఊర అనే ఇద్దరు మావోయిస్టులు పట్టుబడ్డారు. వీరిద్దరు 2012 నుంచి మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తూ అనేక హింసాత్మక, విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నారని.. ఘటనాస్థలంలో మావోయిస్టులకు చెందిన టైగర్, తీర్ బాంబులు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు.
ఇదీ చదవండిఃదసరా వేళ బస్సులు లేక ప్రయాణికులు ఇక్కట్లు