రాష్ట్రంలో ప్రాణవాయువు కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుటోంది ప్రభుత్వం. ఇవాళ ఎయిర్‌ఫోర్స్ విమానంలో 50 మెట్రిక్ టన్నుల సామార్థ్యం కలిగిన 5 ఆక్సిజన్ ట్యాంకర్లను ఒడిషాకు పంపించారు. మధ్యాహ్నం మరో ఆక్సిజన్ ట్యాంకర్‌ను కూడా పంపించనున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.
విమానంలో ఒడిషాకు ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లు - తెలంగాణ వార్తలు
ఎయిర్‌ఫోర్స్ విమానంలో 5 ఆక్సిజన్ ఖాళీ ట్యాంకర్లను ఒడిషాకు పంపారు. మధ్యాహ్నం మరో ఆక్సిజన్ ట్యాంకర్‌ను కూడా పంపించనున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.
ఆక్సిజన్ ట్యాంకర్లు
ట్యాంకర్ల సేకరణతో పాటు.. వాటిని ఒడిషాకు పంపించడం తిరిగి ఇక్కడికి తీసుకువచ్చే ప్రక్రియను రవాణా శాఖ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఆక్సిజన్ ట్యాంకర్ల రాకపోకలను అధికారులు ట్రాకింగ్ విధానం ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:మీ దగ్గర పనిచేశా.. మీ గురించి తెలియదా?: ఈటల