తెలంగాణ

telangana

ETV Bharat / state

పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగ సంఘాల హర్షం

ప్రభుత్వ ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. వయోపరిమితి పెంపు, ఒప్పంద ఉద్యోగులకూ వర్తింపజేస్తూ ప్రకటన జారీ చేసిన సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపాయి.

EMPLOYEES JAC welcomed the CM KCR statement on the PRC
పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగసంఘాలు హర్షం

By

Published : Mar 22, 2021, 1:31 PM IST

Updated : Mar 22, 2021, 1:47 PM IST

పీఆర్సీపై సీఎం కేసీఆర్​ శాసనసభలో ప్రకటన జారీ చేచారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్​మెంట్​ను ఇస్తున్నట్లు తెలిపారు. పీఆర్సీపై సీఎం ప్రకటనను ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షం వ్యక్తం చేశాయి.

పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగసంఘాలు హర్షం

సీఎం కేసీఆర్‌కు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. పదవీ విరమణ వయసు పెంపు సంతోషమని ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. ఉద్యోగులు గౌరవంగా పనిచేసుకునేలా చేశారని వ్యాఖ్యానించారు. వయోపరిమితి పెంపు, ఒప్పంద ఉద్యోగులకూ వర్తింపజేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల తరఫున సీఎంకు టీజీవో అధ్యక్షురాలు మమత ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదని రుజువైందని అన్నారు. పొరుగు సేవల సిబ్బందికి జీతాలు పెంచడం గర్వకారణమని వెల్లడించారు. పదవీ విరమణ వయసు పెంచి గొప్పదనాన్ని చాటుకున్నారని కొనియాడారు.

ఇదీ చూడండి: ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

Last Updated : Mar 22, 2021, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details