ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేరు చేయడం సమంజసం కాదని... విభజించి పాలించే విధానం తగదని రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ఖండించింది. వర్చువల్ విధానంలో జరిగిన ఐక్యవేదిక అత్యవసర సమావేశంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
'ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేరు చేయొద్దు' - Telangana News Updates
వర్చువల్ విధానంలో ఐక్యవేదిక అత్యవసర సమావేశం హైదరాబాద్లో జరిగింది. ఇందులో స్టీరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేరు చేయొద్దని ఉద్యోగుల ఐక్యవేదిక వెల్లడించింది.
!['ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేరు చేయొద్దు' 'ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేరు చేయొద్దు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10578733-720-10578733-1613016963691.jpg)
ఉపాధ్యాయులను స్థానిక సంస్థల పరిధిలోకి మార్చాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వస్తున్న వార్తలను ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. ఉద్యోగ, ఉపాధ్యాయులను వేరు చేసి వారి ఐక్యతకు చిచ్చు పెట్టే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తున్నట్లు కనిపిస్తోందని... ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తులకు మూలమనే సత్యాన్ని దృష్టిలో ఉంచుకుని వేతనాలు, సర్వీసు నిబంధనలు నిర్ణయించాలని కొఠారి కమిషన్ చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పీఆర్సీని, పదవీవిరమణ వయస్సు పెంపును ఉద్యోగ, ఉపాధ్యాయులు అందరికీ వర్తింపజేయాలని... 2018 జూలై నుంచి మంచి ఫిట్‌మెంట్ వ్వాలని ఐక్యవేదిక కోరింది.
- ఇదీ చూడండి :కార్పొరేట్ కొలువు వదిలి... సేంద్రియ సాగు వైపు..