Employees Health Scheme Telangana : ఉద్యోగులు, పింఛనుదారులకు నగదు రహిత, నాణ్యమైన చికిత్స అందించేందుకు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) పేరిట ప్రత్యేక ఆరోగ్య పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందుకోసం ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు, పింఛనుదారుల కోసం ప్రత్యేక ఆరోగ్య పథకం అమలు చేయాలని.. తొలి పీఆర్సీ ఇచ్చిన నివేదిక మేరకు సర్కార్ ఈ చర్యలు చేపట్టింది. పథకం అమలు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఛైర్‌పర్సన్‌గా ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు. ఉద్యోగులు, పింఛనుదారుల నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని సేకరిస్తారు. ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో మ్యాచింగ్ గ్రాంట్ జమ చేస్తుంది. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు విధి విధానాలను ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు.
EHS for Telangana Govt Employees : ఆరోగ్య పథకానికి తమ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గతంలోనే ప్రభుత్వానికి తెలిపారు. సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావునేతృత్వంలో.. ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవో పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఉద్యోగుల ప్రతిపాదనలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ నివేదికకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో.. ఈహెచ్ఎస్ అమలు కోసం ప్రత్యేకంగా ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు.
Telangana PRC Commission : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు