ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నా... ఆంధ్రా ఉద్యోగుల పెత్తనం మాత్రం వదిలించుకోలేకపోతున్నామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ పేర్కొన్నారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో స్థానికేతరుల ఆధిపత్యంతో తెలంగాణ ఉద్యోగులు నిరుత్సాహపడుతున్నారని అన్నారు. జస్టిస్ ధర్మాధికారి కమిటీ సిఫార్సుల మేరకు ఎక్కడి ఉద్యోగులు అక్కడే విధులు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. కొంతమంది ఆంధ్రాలో నియామకం అయ్యి, సూపర్ న్యూమరీ పోస్టుల కింద ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యపై ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకుని.. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
'ఎక్కడి ఉద్యోగులు... అక్కడే విధులు నిర్వహించాలి' - హైదరాబాద్
ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నా... ఆంధ్రా ఉద్యోగులను మాత్రం వదిలించుకోలేకపోతున్నామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ పేర్కొన్నారు.
'ఎక్కడి ఉద్యోగులు... అక్కడే విధులు నిర్వహించాలి'