తెలంగాణ

telangana

ETV Bharat / state

ముఖ ఆధారిత హాజరు యాప్.. ఆదిలోనే సాంకేతిక ఇబ్బందులు

Face Recognition App Problems In AP: ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేయటంతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా ఇబ్బందుల మధ్యే హాజరు నమోదు చేశారు. ఏపీ సచివాలయం సహా జిల్లాల్లోని కలెక్టరేట్లు, ఇతర జిల్లాల కార్యాలయాలకు ఉదయం 10 గంటల సమయానికే చేరుకున్న ఉద్యోగులు యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుని హాజరు వేసేందుకు ప్రయత్నించినా సాంకేతిక ఇబ్బందుల కారణంగా నమోదు కాలేదు.

Face Recognition App Problems In AP
Face Recognition App Problems In AP

By

Published : Jan 3, 2023, 3:35 PM IST

ముఖ ఆధారిత హాజరు యాప్.. ఆదిలోనే సాంకేతిక ఇబ్బందులు

Face Recognition App Problems In AP: ముఖ ఆధారిత యాప్ ద్వారా హాజరు నమోదు విషయంలో తీవ్ర ఇబ్బందుల మధ్య ఉద్యోగులు హాజరు నమోదు చేశారు. ఏపీ సచివాలయం సహా.. హెచ్​వోడీ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, జిల్లాల కార్యాలయాల వరకూ ఉద్యోగులు తొలిరోజు యాప్ ద్వారా హాజరు వేశారు. అయితే పూర్తి స్థాయిలో ఫేస్ రికగ్నిషన్ సిస్టం యాప్ ద్వారా హాజరు నమోదు కాలేదు. ఉదయం 10 గంటలకే కార్యాలయాలకు చేరుకున్న ఉద్యోగులు యాప్‌ డౌన్ లోడ్ చేసేందుకు ప్రయత్నించారు.

అయితే ఏపీసీఎఫ్​ఎస్​ఎస్​ సర్వర్‌పై ఒత్తిడి పెరగటంతోపాటు నెట్‌వర్క్‌ సమస్య వల్ల కొన్నిచోట్ల యాప్ డౌన్‌లోడ్‌ ఆలస్యమైంది. ఫలితంగా తొలిరోజు.. ఆలస్యంగానే హాజరు నమోదైంది. చాలా కార్యాలయాల్లో ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు ఉద్యోగులకు యాప్ ద్వారా హాజరు నమోదు చేసే అంశంపై అవగాహన కల్పించారు. సాంకేతిక సమస్య వల్ల యాప్ డౌన్ లోడ్ చేసుకోలేని ఉద్యోగులు తిరిగి రిజిస్టర్ లోనే హాజరు నమోదు చేశారు.

ఏపీ సచివాలయం, హెచ్​వోడీ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు 10 గంటలకే హాజరు నమోదు చేశారు. జిల్లా కలెక్టరేట్లు, ఇతర జిల్లా కార్యాలయాల్లోనూ కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. సాంకేతిక సిబ్బంది సాయంతో వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని ఉద్యోగులు జనవరి 16 నుంచి మొబైల్ యాప్ ద్వారానే హజరు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details