డిక్యూ ఎంటర్టైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ (యానిమేషన్) ఎండీ తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకొని... తమకు న్యాయం చేయాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్కు ఆ కంపెనీ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. 16 నెలల నుంచి జీతాలు లేక 1400 ఉద్యోగులు రోడ్డున పడ్డామని వారు కమిషన్కు వివరించారు.
కంపెనీ ఎండీపై ఉద్యోగులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు - animation company MD Thapas Chakraborty
'' 16 నెలల నుంచి జీతాలు లేవు.. 1400 మంది రోడ్డున పడ్డారు. ఒక్కొక్కరికి 14 లక్షలు రావాలి. వేతనాలు అడిగితే.. ఎండీ వేధిస్తున్నాడంటూ''.. ఉద్యోగులంతా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కంపెనీ ఎండీపై ఉద్యోగులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు
ఇప్పటి వరకు ఒక్కొక్కరికి రూ.14 లక్షలు రావాలని ఉద్యోగులు తెలిపారు. ఎండీపై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనాలు అడిగితే వేధింపులకు గురి చేయడమే కాకుండా... కంపెనీ నుంచి తొలిగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండీ పాస్పోర్టు సీజ్ చేసి... అతనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని... తమకు న్యాయం చేయాలని బాధితులు కమిషన్ను వేడుకున్నారు.