తెలంగాణ

telangana

ETV Bharat / state

TRESA: 'రెవెన్యూ ఉద్యోగులపై వివక్ష సరికాదు' - రెవెన్యూ డిపార్ట్​మెంట్ అప్డేట్స్

హైదరాబాద్ నాంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ట్రెసా ముఖ్య నేతలు... రెవెన్యూ శాఖకు చెందిన పలు సమస్యలపై చర్చించారు. శాఖకు సంబంధించిన ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని నాయకులు పేర్కొన్నారు.

TRESA
TRESA

By

Published : Jul 14, 2021, 3:22 PM IST

ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ రెవెన్యూ శాఖలో పదోన్నతులు సహా సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (TRESA) ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పేర్కొంది. హైదరాబాద్ నాంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ట్రెసా ముఖ్య నేతలు... రెవెన్యూ శాఖకు చెందిన పలు సమస్యలపై చర్చించారు.

కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో రెవెన్యూ ఉద్యోగుల క్యాడర్ స్ట్రెంత్ స్థిరీకరించాలని, ఆర్డర్ టు సర్వ్ కింద కొత్త జిల్లాలకు పంపిన రెవెన్యూ ఉద్యోగులను వారి ఐచ్ఛికాల ప్రకారం బదిలీలు చేపట్టాలని ట్రెసా కోరింది. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం అన్ని క్యాడర్ ఉద్యోగుల జాబ్ చార్ట్ రూపొందించాలని... జోనల్ విధానం ప్రకారం ఉద్యోగులకు ఐచ్చికాల మేరకు జిల్లాలకు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని... సీసీఎల్ఏ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పోస్ట్ నియమించాలని కోరారు. వీఆర్ఏలకు స్కేలు వర్తింపజేయాలన్న ట్రెసా... వీఆర్వోలను శాఖలో సర్దుబాటు చేయాలని కోరారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు, డివిజన్లు, మండలాలలో పని చేస్తున్న అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లకు రెగ్యులర్​గా వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న డీఆర్వో పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్న ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్... సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాలని ట్రెసా నిర్ణయించింది.

ఇదీ చూడండి: Neopolis Kokapet: సర్కారుకు రూ.2500 కోట్లు వచ్చే అవకాశం

ABOUT THE AUTHOR

...view details