తెలంగాణ

telangana

ETV Bharat / state

employees allotment: ఉద్యోగుల విభజనపై నేటి నుంచి ఐచ్ఛికాల స్వీకరణ - తెలంగాణలో ఉద్యోగుల విభజన ప్రక్రియ

employees allotment: నూతన జోనల్ విధానానికి అనుగుణంగా కేటాయింపు ప్రక్రియ కోసం జిల్లా కేడర్ ఉద్యోగుల నుంచి ఇవాళ ఐచ్చికాలు తీసుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో లేని జిల్లాల్లో నేటి నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రస్తుత ఉద్యోగుల సీనియారిటీ జాబితా సిద్ధం చేశారు.

Employees Options
Employees Options

By

Published : Dec 9, 2021, 9:44 AM IST

Employees allotment : కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా కేటాయింపు ప్రక్రియ కోసం జిల్లా కేడర్ ఉద్యోగుల నుంచి ఇవాళ ఐచ్ఛికాలు తీసుకోనున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లేని జిల్లాల్లో ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రస్తుత ఉద్యోగుల సీనియారిటీ జాబితాను జిల్లా శాఖాధిపతులు బుధవారం సిద్ధం చేశారు. గురువారం ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు స్వీకరిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని జిల్లాల కేడర్​లను ఉద్యోగులు ప్రాధాన్య క్రమంలో ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక కేటగిరీలు ఏవైనా ఉంటే వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను కూడా జతచేయాలి. ప్రాధాన్యాలకు అనుగుణంగా సీనియారిటీ, ప్రత్యేక కేటగిరీలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేస్తారు.

ఈ నెల 15లోపు జిల్లా స్థాయి కేటాయింపుల కమిటీలు సమావేశమై ఉమ్మడి జిల్లాలోని అన్ని కొత్త జిల్లాల కేడర్​లకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. జిల్లా కేడర్​తో పాటు జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు సంబంధించిన ప్రక్రియను కూడా నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఎమ్మెల్సీ పోలింగ్ ఉన్న జిల్లాలతో పాటు జోనల్, మల్టీజోనల్ పోస్టుల ప్రక్రియ షెడ్యూల్​ను విడిగా ప్రకటించనున్నారు.

ఇదీ చూడండి:Singareni Samme Today : సింగరేణిలో మోగిన సమ్మె సైరన్​... 3 రోజుల పాటు విధులకు బ్రేక్​

ABOUT THE AUTHOR

...view details