తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అత్యవసర సమావేశం శనివారం జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లను తితిదే చేస్తోంది. ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం తిరుమల అన్నమయ్య భవన్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో శ్రీవారి దర్శన విధివిధానాలపై పాలక మండలిలో చర్చించనున్నారు. ఇకపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
దర్శనం విధివిధానాలపై శనివారం తితిదే పాలకమండలి భేటీ - ttd emergency board meeting latest news
శ్రీవారి దర్శనాలు, విధి విధానాలపై తితిదే పాలకమండలి శనివారం అత్యవసర సమావేశం కానుంది. ఈ మేరకు అన్నమయ్య భవన్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు.
![దర్శనం విధివిధానాలపై శనివారం తితిదే పాలకమండలి భేటీ emergency-ttd-board-meeting-in-tirumala-annamayya-bhavan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7870222-92-7870222-1593743668271.jpg)
శ్రీవారి దర్శన విధివిధానాలపై తితిదే అత్యవసర సమావేశం
TAGGED:
తితిదే తాజా వార్తలు