ఈటల అధ్యక్షతన నిపుణుల కమిటీ అత్యవసర భేటీ - తెలంగాణలో కొవిడ్ ప్రభావం
12:22 December 24
ఈటల అధ్యక్షతన నిపుణుల కమిటీ అత్యవసర భేటీ
కొత్త రకం కరోనా స్ట్రైయిన్పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బీఆర్కే భవన్లో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిపుణుల కమిటీతో అత్యవసర సమావేశం జరుగుతుంది. రెండో దశను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తున్నారు.
విదేశాల నుంచి వచ్చిన వారికి వైరస్ నిర్ధరణ పరీక్షలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన వైద్యారోగ్య శాఖ.. యూకే నుంచి ఇప్పటివరకు 1,200 మంది వచ్చినట్లు తెలిపింది. వారిందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించి.. క్వారంటైన్లో ఉంచుతున్నట్లు తెలిపింది. బ్రిటన్ నుంచి ఇటీవల రాష్ట్రానికి వచ్చిన వారు 040- 24651119 ఫోన్ 9154170960కి వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరింది.