తిరుపతి రుయా ఆస్పత్రిలో అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. తమిళనాడులోని పెరంబదూరులో నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ ఆస్పత్రికి చేరుకుంది.
రుయా ఆస్పత్రిలో కొనసాగుతున్న అత్యవసర వైద్య సేవలు - రుయా తాజా వార్తలు
ఏపీలోని తిరుపతి రుయా ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలు కొనసాగుతున్నాయి. తమిళనాడు శ్రీపెరంబదూరు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రుయాకు చేరుకుంది. సిబ్బంది.. 10 కేఎల్ స్టోరేజ్ ట్యాంక్‌లోకి ప్రాణ వాయువును నింపుతున్నారు.
రుయా ఆస్పత్రి
10కేఎల్ స్టోరేజ్ ట్యాంక్‌లోకి సిబ్బంది ఆక్సిజన్ నింపుతున్నారు. ఆక్సిజన్ అందక మృతిచెందిన వారి మృతదేహాలను శవాగారానికి తరలించారు. అధికారులు మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.
ఇదీ చదవండి :ఆగని పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన ఇంధన ధరలు