ఈనెల 20 నుంచి టీవీలు, చరవాణీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ- కామర్స్ కంపెనీల నుంచి కొనుగోలు చేయటం కుదరదని మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ప్రకటించింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవలు మాత్రమే ఈనెల 20 నుంచి పొందే అవకాశం ఉందని.. టీవీలు, ఫోన్లు వంటివి అత్యవసర వస్తువుల జాబితాలోకి రావని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. వస్తువుల సరఫరాను ఆన్లైన్ ఈ కామర్స్ కంపెనీల ద్వారా అనుమతిస్తే.. డెలివరీ బాయ్‌లు, ప్యాకింగ్ వేర్‌హౌస్‌లు, రీసెల్లర్లు ఇలా చాలా మంది జీవితాలు రిస్క్‌లోకి వెళతాయని పేర్కొంది. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా ఈ-కామర్స్ కంపెనీల ద్వారా ప్రస్తుతం అత్యవసర సరకుల రవాణానే అనుమతిస్తామని తెలిపింది.
'ఈ- కామర్స్ కంపెనీల నుంచి అత్యవసర వస్తువులు మాత్రమే' - latest news on Emergency items only from e-commerce companies
కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈనెల 20 నుంచి అత్యవసర సేవలు మాత్రమే ఈ- కామర్స్ కంపెనీల నుంచి పొందే అవకాశం ఉందని మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ప్రకటించింది. టీవీలు, ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడం కుదరదని స్పష్టం చేసింది.
'ఈ-కామర్స్ కంపెనీల నుంచి అత్యవసర వస్తువులు మాత్రమే'