తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాజన్న సంక్షేమ పాలన తీసుకు రావడమే ధ్యేయమంటూ.. తెలంగాణ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల (Ys Sharmila)... వైఎస్‌ఆర్ తెలంగాణ (YSRTP) పార్టీ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు.
YSRTP: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం - Ys sharmila latest news
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టినట్లు చెప్పారు. మహానేత పుట్టిన రోజునే పార్టీ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం
వైఎస్‌ఆర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడే ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తల్లి వైఎస్ విజయమ్మ, భర్త అనిల్‌కుమార్, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలితో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: LIVE UPDATES: సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ: షర్మిల