పురాతన వస్తువులు ఇంట్లో ఉంటే కోట్లు వస్తాయని నమ్మించి మోసం చేసే ముఠాను ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పలూరుకు చెందిన వెంకట సుబ్బారావు పుట్టుకతోనే దివ్యాంగుడు. గోపి, చక్రపాణిలతో కలిసి.. పాత నాణేలు, రంగు రాళ్లకు అపారమైన మహిమలు ఉంటాయని అమాయకులను నమ్మించి వారి నుంచి డబ్బులు వసూలు చేసేవారు. మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిన ఒక నల్లని లక్క ముక్కకు అశేష మహిమలు ఉన్నాయని... ఒక డెమో వీడియో సృష్టించారు.
పాత నాణేలు, రంగురాళ్లతో పేరుతో బురిడీ - ఏపీలో పురాతన వస్తువులకు మహిమలంటూ మోసం వార్తలు
తాము ఇచ్చే పాత నాణేలు, రంగురాళ్లకు అశేష మహిమలు ఉన్నాయని.. ఇంట్లో పెట్టుకుంటే కోట్లు వస్తాయని అమాయకులను నమ్మిస్తారు. అవి కొనుక్కున్న ఎవరైనా మోసపోయామని గ్రహించి ఎదురుతిరిగితే నకిలీ తుపాకీతో బెదిరిస్తారు. ఓ దివ్యాంగుడు తన బృందంతో కలిసి చేస్తోన్న ఇలాంటి మోసాలకు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీసులు చెక్ పెట్టారు. పక్కా సమాచారంతో ముఠాను అరెస్టు చేశారు.
పాత నాణేలు.. రంగురాళ్లకు అశేష మహిమల పేరిట మోసం
ఈ క్రమంలో ఏలూరులో ఓ వ్యక్తికి లక్కరాయిని అమ్మాలని తన తోటివారిని తీసుకువస్తుండగా.. పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. కొనుక్కున్నవారు ఎవరైనా ఎదురు తిరిగితే.. డమ్మీ తుపాకీతో బెదిరించేవాడని ఏలూరు డీఎస్పీ దిలీప్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి డమ్మీ తుపాకి, రూ. 20 వేలు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
TAGGED:
Ap eleuru crime news