తెలంగాణ

telangana

ETV Bharat / state

'రోగుల నమూనాల్లో భారలోహా అవశేషాలను గుర్తించాం' - AP news

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రోగుల నుంచి సేకరించిన నమూనాల్లో భార లోహాల అవశేషాలను ప్రాథమికంగా గుర్తించినట్లు.. మంగళగిరి ఎయిమ్స్ పర్యవేక్షకులు డా. రాకేష్ కక్కర్ వివరించారు. నీరు, ఆహార నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు రాకేష్ కక్కర్ చెప్పారు.

eluru-incident-residues-of-heavy-metals-in-samples-dot in ap
'రోగుల నమూనాల్లో భారలోహా అవశేషాలను గుర్తించాం'

By

Published : Dec 8, 2020, 7:58 PM IST

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రోగుల నుంచి సేకరించిన నమూనాల్లో భార లోహాల అవశేషాలను ప్రాథమికంగా గుర్తించినట్లు.. మంగళగిరి ఎయిమ్స్ సూపరింటెండెంట్ డా. రాకేష్ కక్కర్ తెలిపారు. సీసం, నికెల్ లోహాల కారణంగానే స్పృహ కోల్పోవడం, మూర్ఛ లక్షణాలు వచ్చాయని వివరించారు. నీటి కాలుష్యమే కారణమై ఉంటుందని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఎక్కడినుంచి ఈ భార లోహాలు వచ్చాయో తెలుసుకునేందుకు దిల్లీ ఎయిమ్స్ నుంచి మరో బృందం ఏలూరు వెళ్లిందని తెలిపారు. నీరు, ఆహార నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు డా. రాకేష్ కక్కర్ చెప్పారు.

ఇదీ చూడండి:నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలి: మహమూద్ అలీ

ABOUT THE AUTHOR

...view details