జంటనగరాల పరిధిలో రూ.426 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఈనెల 11న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారని మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. 350 కోట్లతో ఇందిరాపార్కు నుంచి వీఎస్‌టీ వరకు మొదటి దశలో నిర్మించనున్న నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జిని నిర్మించాలని తలపెట్టారు.
మరో రూ.76 కోట్లతో రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు ఫేజ్-2లో మూడు లేన్ల ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఈ పనులు 24 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంగా నిర్ణయించారు.
ఆ బ్రిడ్జి అందుబాటులోకి రావటం ద్వారా ఇందిరా పార్కు నుంచి వీఎస్‌టీ జంక్షన్ వరకు ట్రాఫిక్ రద్దీతోపాటు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. హిందీ మహా విద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీల వైపు ట్రాఫిక్ సమస్య తొలగిపోతుందని బొంతు రామ్మోహన్ చెప్పారు.