హైదరాబాద్‌లో దీపావళిని పురస్కరించుకుని మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. టపాసులపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించిన వేళ విద్యుత్ దీపాల వెలుగులో కళను సంతరించుకున్నాయి. ప్రజలు విద్యుత్ దీపాల కొనుగోలుకు పెద్దఎత్తున తరలిరావడంతో అబిడ్స్ ట్రూప్ బజార్ సందడిని తలపించింది.
భాగ్యనగరంలో కాంతులు విరజిమ్ముతున్న దుకాణాలు - హైదరాబాద్ నగర వార్తలు
దీపావళి వచ్చిందటే చాలు ఎక్కడ చూసినా రంగురంగుల దుకాణాలు దర్శనమిస్తాయి. రకరకాల టపాసులు విక్రయాలతో మార్కెట్లు కిక్కిరిసిపోతాయి. ఈ ఏడాది కరోనా వల్ల ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతో టపాసుల అమ్మకాలు తగ్గినా...విద్యుత్ దీపాలతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ప్రజలు పెద్దఎత్తున కొనుగోలుకు మొగ్గుచూపడంతో అబిడ్స్ ట్రూప్ బజార్ సందడిని తలపిస్తోంది.
భాగ్యనగరంలో కాంతులు విరజిమ్ముతున్న దుకాణాలు
ఇళ్లను కాంతివంతంగా మార్చేందుకు విభిన్న రకాల విద్యుత్ దీపాల వైపు ప్రజలు మక్కువ చూపిస్తున్నారు. గృహాలను అందంగా అలంకరించేందుకు పలు రకాల విద్యుత్ దీపాలు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. నగరంలో వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు దుకాణాల వద్ద బారులు తీరారు.