పండుగ సీజన్ వచ్చిందంటే ఆటోమొబైల్స్తో పాటు.. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు(Electronic sales in festive season), గ్యాడ్జెట్ల కొనుగోళ్లకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు షాపింగ్ మాళ్లు, రిటైలర్లు సైతం ఆకర్షణీయమైన ఆఫర్లతో సేల్స్ పెంచుకునేందుకు తాపత్రయపడుతుంటారు. ఈ దసరా పండుగ సీజన్ అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు రెండు వర్గాలను ఖుష్ చేసింది. గతేడాదితో పోలిస్తే రెట్టింపు అమ్మాకాలతో ఒకవైపు రిటైలర్లు, ఆకర్షణీయమైన(Electronic sales in festive season) రాయితీలు, క్యాష్ బ్యాక్‌లతో కొనుగోలుదారులు ఇరువురు లబ్ధి పొందేలా చేసి.. ఎలక్ట్రానిక్స్ సేల్స్‌ను అమాంతం పెంచేశాయి.
మినీ థియేటర్లపై మోజు
గతేడాదితో పోలిస్తే డబుల్ అమ్మకాలు(Electronic sales in festive season) జరిగినట్లు బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్ మేనేజర్ ముత్యం కుమార్ తెలిపారు. దసరా, దివాళీ పండుగ సీజన్లలో టీవీలు, సెల్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. వినోదానికి కేరాఫ్ అయిన సినిమా క్రమంగా ఓటీటీలకు మళ్లుతుండటంతో ఇంట్లో మినీ థియేటర్ ఏర్పాటుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఐపీఎల్, వరల్డ్ కప్ సీజన్లు పెద్ద టీవీలకు డిమాండ్ మరింత పెంచాయి. 55, 65, 75, 85 ఇంచుల టీవీలకు డిమాండ్ ఎక్కువ ఉందని రిటైలర్లు పేర్కొన్నారు. కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్లు మార్కెట్లో ప్రస్తుతం 4కె తో పాటు.. 8కె టెక్నాలజీ రిజల్యూషన్‌లో టీవీలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
కలిసొచ్చిన వర్క్ ఫ్రం హోం
టీవీలతో పాటు సౌండ్ బాక్స్‌లకు అంతే డిమాండ్ ఉందని.. వాటినీ ఎక్కువగా కొంటున్నారని రిటైలర్లు(Electronic sales in festive season) తెలిపారు. చాలా మంది ఇంకా ఇంటి నుంచే పని చేస్తుండటంతో డిష్ వాషర్లకూ ఆదరణ పెరుగుతోందని వివరించారు.
రిటైల్ దుకాణాల్లో ఆన్లైన్ మాదిరిగానే ఫైనాన్స్ కంపెనీలు సరసమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నాయి. రూ. 25 వేల వరకు క్యాష్ బ్యాక్‌లు అందజేస్తున్నాం. ఆన్లైన్ కన్నా మెరుగైన ధరలు, ఉత్పత్తులను స్టోర్లలో అందిస్తున్నాం. -ముత్యం కుమార్, ఎలక్ట్రానిక్ స్టోర్ మేనేజర్