తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్‌ కార్మికుల మహా ధర్నా.. ఆ రూట్​లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌! - హైదరాబాద్‌లో విద్యుత్‌ కార్మికుల మహాధర్నా

Electricity Workers Dharna About PRC Fitment: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ కార్మికులు పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని కోరుతూ మహాధర్నా నిర్వహించాయి. వెంటనే విద్యుత్‌ కార్మికుల పెన్షన్‌.. ఇంకా మిగిలిన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మహాధర్నా ఖైరతాబాద్‌లోని విద్యుత్‌ సౌధ దగ్గర నిర్వహించారు.

electric employes
electric employes

By

Published : Mar 24, 2023, 3:44 PM IST

Electricity Workers Dharna About PRC Fitment: ఖైరతాబాద్ విద్యుత్ సౌధ దగ్గర తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని.. మహా ధర్నా నిర్వహించారు. వేతన సవరణ, ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన మహా ధర్నాకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వరకు ఉన్న రోడ్డులో వాహనాలు తిరుగకుండా పూర్తిగా నిలిపివేశారు. విద్యుత్‌ ఉద్యోగులు సంతోషపడే విధంగా పీఆర్సీని ప్రకటించాలని విద్యుత్‌ కార్మికులు కోరుతున్నారు.

పీఆర్సీని ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలి: ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ఫిట్​మెంట్ ప్రకటించాలని విద్యుత్ జేఏసీ ఛైర్మన్ సాయిబాబు డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలని.. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్‌ నిలుపుదల చేసే పరిస్థితి తెచ్చుకోకుండా ప్రభుత్వం చూసుకోవాలని హితవు పలికారు. . ప్రభుత్వం స్పందించకపోతే మిగతా రాష్ట్రాలలో పోరాటం చేసినట్లే.. తాము కూడా నిరసనలు చేపడతామని జేఏసీ ఛైర్మన్‌ పేర్కొన్నారు. తమ హక్కుల కోసం అందరం కలిసి పోరాటం చేయాలని అనుకున్నామని.. యాజమాన్యానికి ,ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదన్నారు. రాష్ట్రంలో 24గంటలు పనిచేస్తున్న సంస్థ కేవలం విద్యుత్‌ సంస్థనే అని హర్షించారు.

లాభనష్టాలతో సంబంధం లేకుండా పీఆర్సీ ఇవ్వాలి: ఏడాది నుంచి చూస్తున్నాము పీఆర్సీ ఇస్తారేమోనని.. అయినా ప్రభుత్వం, యాజమాన్యం స్పందించలేదని అందుకే తాము నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని విద్యుత్‌ జేఏసీ కన్వీనర్‌ రత్నాకర్‌ రావు పేర్కొన్నారు. సంస్థలు నష్టాల్లో ఉన్నాయి.. కావున పీఆర్సీ ఫిట్‌మెంట్‌ ఎక్కువగా ఇవ్వలేమని యాజమాన్యాలు చెప్పుతున్నాయి కదా.. గతంలో విద్యుత్‌ సంస్థలు నష్టాల్లో ఉన్నప్పుడు మంచిగా పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ఇచ్చారని గుర్తు చేశారు. సంస్థ లాభనష్టాలతో తమ పీఆర్సీకి ముడి పెట్టడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ ఉద్యోగులు కష్టపడి పనిచేయడం వల్లనే రాష్ట్రంలో 24గంటల విద్యుత్‌ను ఇస్తున్నారని తెలిపారు.

యాజమాన్యానికి నెల రోజుల క్రితమే సమ్మె నోటీస్ ఇచ్చామని.. అయినా ప్రభుత్వం స్పందించలేదని నాయకులు పేర్కొన్నారు. విద్యుత్ కార్మికులకు పీఆర్సీ ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలడి డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మిగతా రాష్ట్రాలలో పోరాటం చేసినట్లే.. తాము కూడా నిరసనలు చేపడతామని పేర్కొన్నారు. జేఏసీ పిలుపు మేరకు విద్యుత్‌ ఉద్యోగులు అందరూ కలిసి కట్టుగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

భారీగా ట్రాఫిక్‌ జాం: హైదరాబాద్​లోని ఖైరతాబాద్ ప్రధాన రహదారి వాహనాలతో కిక్కిరిసి పోయింది. విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ ఉద్యోగులు మహాధర్నా నిర్వహించడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యుత్ ఉద్యోగులు తరలివచ్చారు. విద్యుత్ సౌద ప్రాంగణం మొత్తం ఉద్యోగులతో నిండిపోయి.. సిబ్బంది ప్రధాన రహదారిపైకి వచ్చారు. ఒక్కసారిగా వందల మందితో ప్రధాన రహదారి నిండిపోవడంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details