హైదరాబాద్‌లో నిలిచిన విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు - etv bharat
09:39 October 14
హైదరాబాద్‌లో విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం
భారీ వర్షంతో హైదరాబాద్‌లో విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల చెట్లు విరిగి పడడం వల్ల విద్యుత్ తీగలు తెగిపోయాయి. అనేక చోట్ల రోడ్లకు గండ్లు పడడం వల్ల ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులకు సెలవులు ప్రకటించాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ ఇంకా పునరుద్ధరించలేదు. అటు ఇంటర్ నెట్ సౌకర్యం కూడా చాలామందికి దూరమైంది.
ఇదీ చదవండి:జాతీయ రహదారిపై 10 కి.మీ మేర నిలిచిన వాహనాలు