తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ సంస్థలకు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లతో కలిపి 70వేల మంది తమ ఒక రోజు వేతనం మొత్తం రూ.11.40 కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు. నాలుగు సంస్థలకు చెందిన సీఎండీలు, వివిధ విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకుల సమక్షంలో జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెక్కును అందజేశారు.
కరోనా కష్ట కాలంలో విద్యుత్ ఉద్యోగులంతా రేయింబవళ్లు కష్టపడి నితరంతరం విద్యుత్తు అందిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. ఉద్యోగులంతా తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించడం ప్రభుత్వానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.