తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్​ బిల్లుల వసూలు కేంద్రాల సమయంలో మార్పులు - electricity bill collection centers timings change

విద్యుత్​ బిల్లుల వసూలు కేంద్రాల సమయంలో మార్పులు చేసినట్లు టీఎస్‌ఎస్పీడీఎల్‌ ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేంద్రాలు తెరిచి ఉంటాయని వెల్లడించింది. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

విద్యుత్​ బిల్లుల వసూలు కేంద్రాల సమయంలో మార్పులు
విద్యుత్​ బిల్లుల వసూలు కేంద్రాల సమయంలో మార్పులు

By

Published : May 18, 2021, 9:16 AM IST

లాక్​డౌన్​ దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం విద్యుత్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లుల వసూలు కేంద్రాల సమయంలో మార్పులు చేసినట్లు ప్రకటించింది. ఉదయం ఆరు గంటల నుంచే తెరిచి ఉంటాయని టీఎస్‌ఎస్పీడీఎల్‌ వెల్లడించింది.

ఈఆర్‌వో కేంద్రాలు మినహా అన్ని కేంద్రాలు 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పని చేస్తాయని వివరించింది. ఈఆర్‌వో కేంద్రాలు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు పనిచేస్తాయని వెల్లడించింది. వినియోగదారులు సంస్థ చెల్లింపు కేంద్రాల్లోనే కాకుండా టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ యాప్‌, వెబ్‌సైట్‌ లేదా ఫోన్‌పే, పేటీఎం ద్వారా బిల్లులు కట్టవచ్చని పేర్కొంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

ఇదీ చూడండి: రూ.350 కోట్ల విలువైన బియ్యం ఎగవేత.. ఇప్పటికీ చర్యలు లేవు..

ABOUT THE AUTHOR

...view details