తెలంగాణ

telangana

ETV Bharat / state

వచ్చే ఫిబ్రవరిలో భారత్​లోకి డావో ఈ-బైక్​లు - హైదరాబాద్​ తాజా వార్త

త్వరలో భారత మార్కెట్​లో మొదటి ఈ-ద్విచక్ర వాహనాన్ని  ఆవిష్కరించనున్నట్లు చైనా చెందిన ఈవీ కంపెనీ డావో సీఈవో మైఖేల్​ లియూ తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై డావో ఈవీటెక్ హైదరాబాద్​లో సమావేశం నిర్వహించింది.

electric bikes launch in dao company in Hyderabad
వచ్చే ఫిబ్రవరిలో భారత్​లోకి రానున్న డావో ఈ-బైక్​లు

By

Published : Dec 16, 2019, 8:08 PM IST

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తమ మొదటి ఈ-వాహనాన్ని భారత మార్కెట్​లో ఆవిష్కరిస్తున్నట్లు చైనాకు చెందిన ఈవీ కంపెనీ డావో ప్రకటించింది. విద్యుత్ ద్విచక్ర వాహన విభాగంలో 25 సంవత్సరాలకు పైగా అంతర్జాతీయ అనుభవం గల డావో ఈవీ టెక్ హైదరాబాద్​లో నిర్వహించిన ఓ సమావేశంలో దీనిని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్లాంట్​ను తెలుగు రాష్ట్రాల నుంచే ఆపరేట్ చేయనున్నట్లు కంపెనీ ఛైర్మన్ అండ్ సీఈవో మైఖేల్ లియు పేర్కొన్నారు.

నగరాలను కాలుష్య కోరల నుంచి కాపాడేందుకు.. అభిరుచి గల యువతను ఆకట్టుకునేందుకు విద్యుత్ ఈవీ బైక్ మార్కెట్ దోహదపడుతుందని కంపెనీ భారత సీఎఫ్​వో అచ్యుతుని బాలాజీ తెలిపారు. లో స్పీడ్, హై స్పీడ్ వేరియంట్ లలో లభ్యమయ్యే డావో ఈ-బైకులు చైనాలో 150కు పైగా రకాలలో అందుబాటులో ఉన్నాయని.. వీటిలో వీలైనన్ని ఎక్కువ మోడళ్లను ఇండియాకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

వచ్చే ఫిబ్రవరిలో భారత్​లోకి రానున్న డావో ఈ-బైక్​లు

ఇదీ చూడండి: కొలను కాలుష్యంపై కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details