తెరాసను ఎదుర్కొనే సత్తా లేక రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యాయని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో కేటీఆర్ సమక్షంలో.. తెదేపా నేత గణేశ్‌గుప్తాతో పాటు.. శంషాబాద్ తెదేపా కార్యకర్తలు తెరాసలో చేరారు. కేసీఆర్ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమే మున్సిపల్ ఎన్నికల ఫలితాలని స్పష్టం చేశారు. బలహీన వర్గాలకు పెద్దపీఠ వేసిన ఏకైక పార్టీ తెరాస అని.. మున్సిపల్ ఎన్నికల్లో 57శాతం మహిళలకు కేటాయించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా ప్రజలు తెరాస వైపే.. - Ktr on Telangana Muncipall Elections News
హైదరాబాద్ తెలంగాణభవన్‌లో కేటీఆర్ సమక్షంలో.. తెదేపా నేత గణేశ్‌గుప్తాతో పాటు..శంషాబాద్ తెదేపా కార్యకర్తలు తెరాసలో చేరారు. బలహీన వర్గాలకు పెద్దపీఠ వేసిన ఏకైక పార్టీ తెరాస అని.. మున్సిపల్ ఎన్నికల్లో 57శాతం మహిళలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ఏవైనా ప్రజలు తమవైపే ఉన్నారని.. కాంగ్రెస్‌పై దేశవ్యాప్తంగా ప్రజలకు నమ్మకం పోయిందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా ప్రజలు తెరాస వైపే..
రాష్ట్రంలో 11 మంది ఆర్యవైశ్యులు మున్సిపల్ ఛైర్మన్లు అయ్యారని.. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తున్న పార్టీ గులాబీ అని పేర్కొన్నారు. ఎన్నికలు ఏవైనా ప్రజలు తమవైపే ఉన్నారని.. కాంగ్రెస్‌పై దేశవ్యాప్తంగా ప్రజలకు నమ్మకం పోయిందని స్పష్టం చేశారు. 130 స్థానాలకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెరాస 122 స్థానాలు కైవసం చేసుకుంటే.. కాంగ్రెస్ 4, భాజపా 2 ఎంఐఎం 2 స్థానాలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి:అశ్వత్ధామరెడ్డికి నోటీసులు.. అందుకేనట!
Last Updated : Feb 2, 2020, 11:53 PM IST