ఐఐటీల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష వాయిదా పడింది. మే19న జరగాల్సిన ఈ పరీక్షను అదే నెల 27న నిర్వహించనున్నట్లు ఐఐటీ రూర్కీ ప్రకటించింది. మే 19న ఎనిమిది రాష్ట్రాల్లో తుది విడత పోలింగ్ ఉన్నందున ఈ పరీక్షను వాయిదా వేశారు.
మే 27న పేపర్-1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జేఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 12 వరకు జరగనున్నాయి.
ఎలక్షన్ ఎఫెక్ట్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష వాయిదా - IIT ROORKEE
దేశ గమనాన్ని నిర్దేశించే సార్వత్రిక ఎన్నికలు విద్యార్థుల పరీక్షలకు అడ్డు తగిలాయి. ఇంజనీరింగ్లో అత్యున్నత స్థాయి సీట్ల కోసం జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష వాయిదాకు కారణమయ్యాయి.
ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 12 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు
ఇవీ చూడండి :కన్నడనాడి: ఓట్ల బదిలీ సాధ్యమేనా?