తెలంగాణ

telangana

ETV Bharat / state

హైకోర్టు నిర్ణయం తర్వాతే మేయర్‌, ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక - పురపాలక సంఘాల ఎన్నికలు

రాష్ట్రంలో రెండు నగరపాలక సంస్థలు, ఐదు పురపాలక ఎన్నికల ప్రక్రియ సోమవారం ముగిసింది. ఎన్నికైనవారి ప్రమాణస్వీకారంతో పాటు, ఛైర్‌ పర్సన్‌ల ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే పురపాలక ఎన్నికల అంశంపై హైకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో.. ఈ ఎన్నికకు మరి కొంత సమయం పట్టేటట్లు కనిపిస్తోంది.

Election of the Mayor
Election of the Mayor

By

Published : May 4, 2021, 8:39 AM IST

రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన రెండు నగరపాలక సంస్థల మేయర్‌లు, ఐదు పురపాలక సంఘాల ఛైర్‌ పర్సన్‌ల ఎన్నికకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. పురపాలక ఎన్నికల అంశంపై హైకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో న్యాయస్థానం అనుమతితోనే మేయర్‌, ఛైర్‌ పర్సన్‌ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించనుందని తెలుస్తోంది.

వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థలు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్‌, కొత్తూరు పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికైనవారి ప్రమాణస్వీకారంతో పాటు, ఛైర్‌ పర్సన్‌ల ఎన్నిక జరగాల్సి ఉంది. వీటి కోసం నిర్వహించే ప్రత్యేక సమావేశాల తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించి నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంది. పురపాలక ఎన్నికల అంశంపై ఇటీవల హైకోర్టులో విచారణ జరిగింది. కొవిడ్‌ కారణంగా దాఖలైన కేసు విచారణలోనే ఉన్న నేపథ్యంలో ప్రత్యేక సమావేశం, మేయర్‌, ఛైర్‌ పర్సన్‌ల ఎన్నికకు కోర్టు నిర్ణయం మేరకే ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేస్తుందని ఉన్నతాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:దేవరయాంజాల్‌ భూములను పరిశీలించిన ఐఏఎస్‌ల కమిటీ

ABOUT THE AUTHOR

...view details