ఈ నెల 27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక - state election commission latest news
15:15 January 23
ఈ నెల 27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక
నగరపాలక సంస్థల మేయర్లు, పురపాలక సంస్థల ఛైర్ పర్సన్ల పదవుల కోసం ఈ నెల 27న పరోక్ష ఎన్నిక జరగనుంది. ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. కరీంనగర్ మినహా మిగతా చోట్ల మేయర్, ఛైర్ పర్సన్ల ఎన్నిక జరగనుంది.
ఈనెల 27న పాలకమండళ్లు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ప్రత్యేక సమావేశం కోసం ఈనెల 25న అధికారులు నోటీసు జారీ చేస్తారు. 27 ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 12.30 కు మేయర్, ఛైర్ పర్సన్ల ఎన్నిక చేపడతారు. అనంతరం డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్ పర్సన్ల ఎన్నిక జరుగుతుంది. ఒకవేళ 27న ఎన్నిక జరగకపోతే 28న ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మేయర్, ఛైర్ పర్సన్ ఎన్నిక కాకుండా డిప్యూటీల ఎన్నిక చేపట్టరాదని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
TAGGED:
sec latest news