Election Effect at Bus Stands in Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) ఓటు వేసేందుకు రాష్ట్ర ప్రజలు సిటీ నుంచి సొంతూళ్ల బాట పట్టారు. వివిధ జిల్లాలకు వెళ్లేవారు ఒకరోజు ముందుగానే సొంతూళ్లకు బయలుదేరారు. రాష్ట్రంలోపోలింగ్ సందర్భంగా విద్యాసంస్థలకు నేడు, రేపు రెండు రోజులు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. దీంతో మంగళవారం సాయంత్రం నుంచే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుటుంబాలతో వెళ్తుండగా బస్ స్టాండ్‌లలో రద్దీ కనిపిస్తోంది. అలాగే గత రెండు మూడు రోజులుగా అడ్డాలపై కూలీలు కూడా పెద్దగా కనిపించడం లేదు.
పనుల కోసం వలన వెళ్లిన ఓటర్లను సొంతూళ్లకు రావాలని ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు కుటుంబ సభ్యులను కోరారు. కొద్దిరోజులుగా అభ్యర్థులు కూడా సిటీకి వచ్చి తమ సెగ్మెంట్లలోని ఓటర్లతోనూ ఆత్మీయ సమ్మేళనాలు సైతం నిర్వహించిన విషయం తెలిసిందే. సొంతూళ్లో ఓటు ఉన్నవాళ్లు తప్పకుండా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అందుకోసం రవాణా సదూపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Bus Stands Rush in Telangana :హైదరాబాద్ సిటీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన ఓటర్లు నివసిస్తుంటారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్, దిల్‌సుఖ్‌నగర్, బీఎన్‌రెడ్డి నగర్ ప్రాంతాల్లో ఉంటున్నారు. అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు మెహిదీపట్నం వైపు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల వారు ఎల్బీనగర్, ఉప్పల్ వైపు.. మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు లింగంపల్లి, బాలానగర్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.
ఎన్నికల్లో మీ ఓటు ఇంకొకరు వేశారా - ఇలా చేస్తే మీ హక్కు మీరే వినియోగించుకోవచ్చు