స్థానిక సంస్థల ఎన్నికలకు ఈనెల 20 లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉందన్న ఆయన ఈనెల 18, 20 తేదీల మధ్య నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది నియామకం పూర్తైందని అన్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణే కాస్త క్లిష్టతరమని... అభ్యర్థుల తుది జాబితా పూర్తయిన తరువాత మూడు రోజుల్లో ముద్రిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అందరికీ ఉంటుందని తెలిపారు.
ఈ నెల 20 లోపు స్థానిక సంస్థల ఏర్పాట్లు పూర్తి - ఈ నెల 20లోపు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక పోరుకు సన్నద్ధమవుతోంది. స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై ఇవాళ వివిధ శాఖల అధిపతులతో కీలక సమావేశం నిర్వహించింది. వచ్చేనెలలో 3 విడతల్లో స్థానిక పోరు నిర్వహించే అవకాశముంది.

ఈ నెల 20లోపు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
TAGGED:
Nagireddy