తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Assembly Elections 2023 : 'ఆ కేంద్రాల్లో సౌకర్యాలు వెంటనే ఏర్పాటు చేయండి' - తెలంగాణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దం

Election Commission
Election Commission

By

Published : Jun 24, 2023, 3:28 PM IST

Updated : Jun 24, 2023, 8:31 PM IST

15:19 June 24

Election Commission Meeting : సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తో సమావేశమైన ఈసీ బృందం

సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తో సమావేశమైన ఈసీ బృందం

Central Election Commission Met Telangana Officials : శాసనసభ ఎన్నికలు సజావుగా, సాఫీగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని, అవసరమైన సదుపాయాలు అన్నీ కల్పిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి వివరించారు. అసెంబ్లీ ఎన్నికలపై సన్నద్ధతా సమీక్షలో భాగంగా ఈసీ ప్రతినిధుల బృందం.. సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైంది.

ఎన్నికల నిర్వహణా కసరత్తు, ప్రణాళిక, కల్పించాల్సిన సదుపాయాలు, ఆర్వోల నియామకం, బదిలీలు - పోస్టింగులు, నిధులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సన్నద్ధత, ఏర్పాట్లు సహా అన్ని అంశాలను సీఎస్ శాంతికుమారి వివరించారు. పోలీసు శాఖ తరపున తగిన ఏర్పాట్లు చేస్తామని, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ఆయా శాఖలు చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలను కార్యదర్శులు వివరించారు.

Telangana Assembly Elections 2023 : పోలింగ్ కేంద్రాలు ఉన్న కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని.. వాటిని ఏర్పాటు చేయాలని ఈసీ బృందం అధికారులకు సూచించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి వసతి, సీఈఓ కార్యాలయంలో అధికారులు - సిబ్బంది ఖాళీల భర్తీ సహా ఇతర అంశాలను త్వరగా పూర్తి చేయాలని సీఎస్​కు చెప్పారు. వీలైనంత త్వరగా అన్నింటిని పూర్తి చేస్తామని సీఎస్ శాంతికుమారి హామీ ఇచ్చారు. అంతకు ముందు వరుసగా రెండో రోజు కూడా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఈసీ బృందం సమావేశమైంది. జిల్లాల వారీగా ఎన్నికల సన్నద్ధతను సమీక్షించింది. ఇవాళ్టితో ఈసీ బృందం మూడు రోజుల సమీక్ష ముగిసింది. అన్ని అంశాలను క్రోడీకరించి కమిషన్ కు నివేదిక అందిస్తారు. దాని ఆధారంగా వచ్చే నెలలో కేంద్ర ఎన్నికల కమిషన్ పూర్తి కమిషన్ రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశం ఉంది.

EC on Telangana Assembly Elections 2023 : శాసనసభ ఎన్నికల సన్నద్ధతపై హైదరాబాద్ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘం బృందం కసరత్తు కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఈసీ ప్రతినిధి బృందం వరుసగా రెండో రోజు సమావేశమైంది. జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక, సన్నద్దతను సమీక్షించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోం, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు జితేందర్, నవీన్ మిత్తల్, సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

EC Team Visits in Hyderabad for Three Days : శాసనసభ ఎన్నికల నిర్వహణ ప్రణాళిక, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం, ఉద్యోగుల బదిలీలు, పోస్టింగులు, రిటర్నింగ్ అధికారుల నియామకం, భద్రత, బలగాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, డబ్బు సహా ప్రలోభాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం వసతి, సీఈఓ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది నియామకం సహా ఇతర అంశాలు కూడా చర్చకు రానున్నాయి.

ఇవీ చదవండి :

Last Updated : Jun 24, 2023, 8:31 PM IST

For All Latest Updates

TAGGED:

BREAKING

ABOUT THE AUTHOR

...view details