Election Boycott in Telangana 2023 :రాష్ట్రమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన పోలింగ్ సమయం రానే వచ్చింది. పలుచోట్ల పెద్ద ఎత్తున ఓటర్లు పోటెత్తటంతో పోలింగ్ కేంద్రాల వద్ద కోలాహలం కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో ఓటర్లంతా పాల్గొని.. తమ ఓటు హక్కును(Right to Vote) విధిగా వినియోగించుకుంటున్నారు. అయితే కొన్నిచోట్ల మాత్రం పోలింగ్ కేంద్రాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు - లాఠీలకు పనిచెప్పిన పోలీసులు
Telangana Assembly Elections 2023 : ఉదయం నుంచి పోలింగ్ సిబ్బంది ఓటర్ల కోసం నిరీక్షిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం.. పలు గ్రామాలు నిరసనల గళం విప్పుతూ.. ఎన్నికల బహిష్కరణకు దిగటమే. ప్రజల గోడు పట్టని ప్రభుత్వాలకు(Government) ఓటెందుకు వేయాలంటూ ఆయా గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించే నాయకులే తప్ప.. తమ సమస్యలకు పరిష్కరించే నాథుడే లేరని వారు వాపోతున్నారు.
Polls Boycott in Adilabad :ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ గ్రామస్థులు పోలింగ్‌కు విముఖత చూపుతున్నారు. బోథ్ నియోజకవర్గ పరిధిలోని 23 పోలింగ్ కేంద్రంలో ఉన్న గొల్లఘాట్ గ్రామంలో 270 మంది ఓటర్లు ఉన్నారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం(Road Facility) లేదని.. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందన లేనందునే ఓటింగ్ బహిష్కరిస్తున్నట్లు చెబుతున్నారు. గ్రామస్థులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా మాట్లాడినా.. వారు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఉదయం నుంచి పోలింగ్ సిబ్బంది ఓటర్ల కోసం నిరీక్షిస్తున్న పరిస్థితి నెలకొంది.
మీ ఓటు తెలంగాణ బతుకు చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దాలి - రాష్ట్ర ప్రజలకు ప్రముఖుల సందేశం